ఇండియన్ ఐడల్-2 లో 'శృతి'లయలు.. లేచి వెళ్ళిపోయిన తమన్!
on Mar 12, 2023

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రతీ శుక్రవారం, శనివారం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతుంది. గ్రాండ్ గా మొదలైన ఈ షో.. మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ షో అల్టిమేట్ సింగింగ్ టాలెంట్ ని వెతికి తీయడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ షో కి జడ్జెస్ గా ఎస్ఎస్ థమన్, సింగర్ కార్తీక్, గీత మాధురి వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. కాగా ఇందులో కంటెస్టెంట్ గా శృతి అనే అమ్మాయి పాడిన పాట హైలైట్ అయింది. అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటున్న తెలుగు అమ్మాయి నండూరి శృతి. తను అమెరికాలో ఒక డాక్టర్.. అయినా కూడా తనకు మ్యూజిక్ పై ఉన్న ఇష్టంతో ఇండియాకి వచ్చి చాలా ప్రోగ్రామ్ ల లో తన గాత్రం వినిపించింది. ఇంకా పలు రకాల మ్యూజిక్ ఆల్బమ్ లను చేసింది. మ్యూజిక్ ని మెడిసిన్ తో కలపడమే తన గోల్ అంటుంది శృతి.
తాజాగా విడుదల అయిన ప్రోమోలో 'శ్రీరామరాజ్యం' మూవీలోని 'శ్రీరామ లేరా ఓ రామ' అనే పాటను పాడిన శృతి.. అందరిని తన గాత్రంతో ఆకట్టుకుంది. శృతి పర్ఫామెన్స్ చూసిన ఎస్ఎస్ తమన్ వచ్చి గోల్డెన్ టికెట్ తీసుకో అని చెప్తాడు. అప్పుడే పక్కన ఉన్న మరో జడ్జ్ కార్తీక్ వన్ సెకండ్ అని ఏదో చెప్తూ ఉండగా.. తమన్ తన సీట్ నుండి వెళ్ళిపోతాడు. దీంతో ఈ ప్రోమోపై అంచనాలు పెరిగాయి. షో పై హైప్ ని క్రీయేట్ చేయడానికి ఇలా చేసారో లేక శృతికి గోల్డెన్ టికెట్ ఇవ్వడం సింగర్ కార్తీక్ కి నచ్చలేదేమో మరి తెలియాలంటే ఈ షో పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



